![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2' . ఇది నవ వసంతం. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -5 లో.. సైకిల్ రేస్ లో దీప పాల్గొని సైకిల్ గెలుచుకొని శౌర్యకి ఇస్తుంది. ఆ సైకిల్ చూసిన అనసూయ.. పోటీ గెలించిందట అంటూ తిడుతుంది. ఈ సైకిల్ ని అమ్మకని అనసూయతో శౌర్య అనగానే.. నేను ఏమైనా సైకిల్ అమ్ముకునే దానిలాగా కన్పిస్తున్నాన అని అనసూయ అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కన్పించిన విషయం గుర్తుకు చేసుకుంటుంది దీప.
అప్పుడే ఒకతను వచ్చి.. నా అప్పు ఎప్పుడు చెల్లిస్తావంటు దీపని అడుగుతాడు.. చెల్లిస్తాను కాస్త టైమ్ పడుతుందని దీప అనగానే.. నువ్వేం ఇచ్చేలా ఉన్నావ్? నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు.. ఇప్పుడు నాకు డబ్బు కావాలి.. ఒక పని చేస్తే నువ్వు నాకు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. నన్ను నీ భర్త అనుకోమని అతను అనగానే.. లాగి చెంపపై ఒక్కటేసి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే అనసూయ రావడంతో జరిగింది చెప్పగానే తను కూడా అతన్ని తిడుతుంది. మీ సంగతి చెప్తానంటు అతను కోపంగా వెళ్తాడు. మరొక వైపు దీప కోసం వెతుక్కుంటూ వస్తుంటాడు కార్తిక్. అడ్రెస్ కోసం దీప చేతిలో దెబ్బలు తిని వస్తున్న అతన్నే కార్తిక్ అడుగుతాడు. అప్పుడే నీకు జరిగిందంతా చెప్పేసిందా? నువ్వు నన్ను ఏం చెయ్యలేవు.. దాన్ని వదలనంటూ దీపని అతను తిడతాడు. దాంతో కార్తీక్ కూడా అతని చెంపపై ఒక్కటిస్తాడు. దీప జోలికి పోతే చంపేస్తానంటూ కార్తీక్ అతనికి వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత వీడి సంగతి చెప్తానని అతను అనుకుంటాడు. మరొకవైపు అనసూయ దగ్గరికి దీప వెళ్లి.. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఏమైనా తెలుసా అని అడుగగా.. తెలియదని అనసూయ చెప్తుంది. మరొకవైపు దీప కన్పించినది గుర్తుకు చేసుకుంటాడు కార్తీక్. దీపని కలిసి ఎలాగైనా క్షమించని అడగాలి. ఆ తప్పుకి కారణం తన జీవితం అలా అవడానికి కారణం తనే అని ఎలాగైనా ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |